Tuesday, November 14, 2017

!!సరిపోయింది!!

నా మానాన్న నన్ను వదిలేయి
సజీవంగా ఉన్నానుగా సరిపోదా!

గాలిని వాటా ఇవ్వమని అడిగాను
కనబడకుండా శ్వాసని ఇచ్చిందిగా

ఒంటరితనాన్ని తోడుకోరుకున్నాను
మది జ్ఞాపకాలే ఊసులు చెప్పెనుగా

జీవితం అడగమని బలవంతపెట్టినా 
అడగడానికి ఆశలంటూ మిగల్లేదుగా!

4 comments:

  1. మనసులోని వ్యధను బయట పెట్టారు.

    ReplyDelete
  2. అణగారిన ఆశలతో కవితను పూరించారు.

    ReplyDelete
  3. ఈ బుచికి తవికలు వ్రాసే వాల్లకి ఏమి ఆనందమో నాకు అర్థం కాదు. తవికలు వ్రాయడం జుగుప్స. లేదు ఈ జబ్బుకు చికిత్స.ఎక్స్లెంట్ పోయెట్రీ.

    ReplyDelete
  4. అసలు జీవితం అంటే ఇంతే.

    ReplyDelete